పెద్ద​అంబర్​పేటలో నెగ్గిన అవిశ్వాసం

పెద్ద​అంబర్​పేటలో నెగ్గిన అవిశ్వాసం
  • మున్సిపల్ చైర్​పర్సన్ పదవిని కోల్పోయిన స్వప్న

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట మున్సిపాలిటీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కాంగ్రెస్​కు చెందిన చైర్​పర్సన్ స్వప్నా చిరంజీవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే  ఆమె ఏకపక్ష నిర్ణయాలు నచ్చకపోవడంతో అవిశ్వాసం పెట్టారు. 

దీంతో ఆమె పదవిని కోల్పోక తప్పలేదు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి సమక్షంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా, మొత్తం 24 మంది కౌన్సిలర్లకు గాను పండుగుల జయశ్రీరాజుకు 17 మంది మద్దతు పలికి చైర్​పర్సన్​గా ఎన్నుకున్నారు. 

అయితే, మెజార్టీ లేకపోవడంతో స్వప్న సమావేశానికి హాజరుకాలేదు. అవిశ్వాసంపై ప్రొసిజర్ పూర్తి చేసి జిల్లా అడిషనల్​ కలెక్టర్ కు నివేదిక పంపించినట్లు ఆర్డీవో తెలిపారు.

విజయశేఖర్ రెడ్డికి ఇన్​చార్జి బాధ్యతలు

స్వప్నపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సంబంధిత నివేదికను జిల్లా అడిషన్ కలెక్టర్​కు పంపిస్తారు.  ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రస్తుత చైర్ పర్సన్​ను రద్దు చేసి కొత్త చైర్ పర్సన్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.అప్పటివరకు వైస్ చైర్మన్​గా ఉన్న చామ సంపూర్ణ విజయశేఖర్​రెడ్డి ఇన్​చార్జి చైర్ పర్సన్ గా కొనసాగనున్నారు.

ఓటింగ్​లో పాల్గొన్నది వీరే..

వీరేగ్యారల శ్రీనివాస్ గౌడ్, వడ్డెపల్లి విద్యావతి, పసుల రాజేందర్, పండుగుల జయశ్రీ,చల్లూరి మురళీధర్ రెడ్డి, జోర్క గీత, ఓరుగంటి సుజాత, చెవుల హరిశంకర్, సిద్దెం కి కృష్ణారెడ్డి, కందాడి అనుపమ, తొండపు రోహిణి, పాశం అర్చన, మండలి కోటేశ్వర్రావు, రమావత్ పరుశురాం, దండెం కృష్ణారెడ్డి, పబ్బతి లక్ష్మణ్, మద్ది నరేందర్ రెడ్డి తదితరులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 

కౌన్సిలర్లు పండుగుల జయశ్రీరాజుకు మద్దతు తెలిపారు. వీరిలో కాంగ్రెస్​కు చెందిన కౌన్సిలర్లు 11 మంది ఉండగా, నలుగురు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ నుంచి ఒక్కో కౌన్సిలర్ మద్దతు తెలిపారు.