మూసీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు

మూసీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు
  • రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి/శంషాబాద్, వెలుగు : మూసీ పరివాహక ప్రాంతంలోని వారికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వడంతోపాటు, అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు. శంషాబాద్ లో రూ.6 కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ బిల్డింగ్​ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు అందరూ కృషి చేయాలని, నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు మెప్మాతోపాటు ఇతర గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయిస్తామన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా , వైస్ చైర్మన్​బండి గోపాల్ యాదవ్, టీయూఎఫ్ఐసీ చైర్మన్​చల్లా నర్సింహారెడ్డి,  కలెక్టర్ శశాంక, ఆర్డీవో వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.