
రంగారెడ్డి జిల్లాలో కృష్ణా వాటర్ పైప్ లైన్ (తాగునీటి పైప్ లైన్) పగిలి నీరు వృథాగా పోతోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామం సమీపంలో కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలింది. దాదాపు రెండు, మూడు గంటల నుంచి తాగునీరు వృథాగా పోతున్నా.. జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు. డైరీ ఫార్మ్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ కు వెళ్లే దారిలో నీరు ఎగిసిపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు గుండా టూవీలర్స్ పై ప్రయాణిస్తున్న వాహనదారులు తడిసి ముద్దవుతున్నారు.