
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లురు గ్రామంలో 5వేల మొక్కలతో 20 అడుగుల గ్రీన్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గ్రీన్ గణేషుడికి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేశామని నిర్వహకులు తెలిపారు. ఈ వినాయకడి విగ్రహంలోని మొక్కలను నిమజ్జనం రోజు భక్తులకు పంచుతామని చెప్పారు.
- ALSO READ | గణేష్ నిమజ్జన పూజా విధానం ఇదే...
సమాజంలో ప్రజలంతా మొక్కలు పెంచి.. పచ్చదనంతో ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో మొక్కలతో వినాయకుడిని తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ గ్రీన్ గణేషుడిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు.