రంగారెడ్ది జిల్లా : దొంగల్లో కూడా ఇంతమంచి వాడు ఉంటాడు. ఓ హోటల్ లో చోరీకి వెళ్లిన దొంగకు నిరాశ ఎదురైంది. కానీ అక్కడ తాను ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రంగారెడ్ది జిల్లా మహేశ్వరం ఏమ్మార్వో ఆఫీస్ ముందున్న వినాయకు మెస్ లో చోరీ జరిగింది. చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మంకీక్యాప్ వేసుకొని, హోటల్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు దొంగ.. హోటల్ మొత్తం వెతికినా ఒక్క రూపాయి కూడా ఏం దొరకలేదు. డబ్బు, విలువైన వస్తువులు వేవీ కనిపించలేదు.
దీంతో విసుకు చెందిన దొంగ హోటల్ సీసీ కెమెరా ముందుకు వచ్చి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఓనర్ కు సైగల ద్వారా... ఒక్క రూపాయి కూడా లేదు, దొంగలు ఏలా బతకాలి అన్నట్లు ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చాడు. మా లాంటి దొంగల కోసం పదోపరకో గళ్లపెట్టెలో పెట్టొచ్చు కదా అని ఓనర్ ను వేడుకున్నాడు.
ఇందంతా చేసి దొంగ అలసిపోయాడట్టుంది పాపం.. ఫ్రీజ్ దగ్గరకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని.. రూ.20 నోటు కౌంటర్ మీద పెట్టాడు.. పండగ చేస్కో అన్న టైప్ లో హోటల్ యజమానికే చోరీకి వచ్చిన దొంగ పైసలు ఇచ్చాడు. తర్వాత రోజు హోటల్ కు వచ్చిన ఓనర్ అనుమానంతో సీసీ పుటేజ్ చూసి షాక్ అయ్యాడు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.