రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి స్కూటీపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి గొలుసును తెలంపుకెళ్లిన ఘటన నిన్న సాయంత్ర(ఫిబ్రవరి 12) జరిగింది. ఈ ఘటనలో మహిళ మెడకు గాయమైంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
దేవరకొండకు చెందిన సంధ్యారాణి గుర్రం గూడా టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. ఎత్తుకెళ్లిన బంగారం నాలుగు తులాలు ఉందని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు.