రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. ఆశా కాలనీకి చెందిన శ్రీనివాసరెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా, రోజు మాదిరిగానే సోమవారం శ్రీనివాసరెడ్డి తన డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా, తాళం పగలగొట్టి ఉంది. ఆపై బీరువాలోని 18.5 తులాల బంగారం కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.