రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామంలోని విజయానంద్ గ్రౌండ్ ముందున్న ఆలయంలో అర్థరాత్రి (ఫిబ్రవరి 7) గుర్తు తెలియని దొంగలు తాళలు పగులగొట్టి.. అమ్మవారి మెడలోని నగలు, హుండీలో ఉన్న డబ్బులను దోచుకెళ్లారు దుండగులు. ఉదయం పూజలు చేసేందుకు ఆలయం వద్దకు పూజారి వచ్చి చూసే సరికి.. గుడి తాళాలు పగల గొట్టారని గమనించాడు.
దీంతో గుడిలో దొంగతనం జరిగినట్లు గ్రహించారు. లోపలికి వెళ్లి చూసేసరికి అమ్మవారి ఆభరణాలు చోరీ చేశారు. దీంతో గుడి పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.