- మిస్యూ డాడ్, మిస్యా మమ్మీ అంటూ సూసైడ్ నోట్
- రంగారెడ్డి జిల్లా చెందిప్పలో విషాదం
శంకర్పల్లి, వెలుగు: గుండెపోటు వస్తుందేమోననే భయంతో ఓ యువకుడు సూసైడ్చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంకర్పల్లి మండలం చెందిప్ప గ్రామానికి చెందిన విద్యాసాగర్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నకొడుకు హరి క్రిష్ణ(22) ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడేండ్ల క్రితం హరి క్రిష్ణకి గుండె నొప్పి రాగా.. స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు నొప్పి వచ్చేది. ఆదివారం తీవ్రంగా రావడంతో శంకర్పల్లికి వెళ్లి మెడికల్షాపులో మందులు తీసుకొని వేసుకున్నాడు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో ఇక తనకు గుండెపోటు వస్తుందని ఆందోళనకు గురయ్యాడు.
ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన రూంలోకి వెళ్లి ''మిస్ యూ డాడ్, మిస్ యూ మమ్మీ, మిస్ యూ అన్న.. నాకు గుండెపోటు వస్తుంది, చిన్న వయసులో చనిపోతున్నందుకు సారీ'' అంటూ సూసైడ్నోట్రాసుకొని ప్యాంట్జేబులో పెట్టుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత తన పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం లేచే సరికి హరి క్రిష్ణ ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. చివరికి పొలం వద్ద విగతజీవిగా కనిపించడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.