- రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్
హైదారాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్‌లలో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ ను డిస్పోజల్ చేయాలని, స్వాధీనం చేసుకున్న వాహనాలను వేలం వేయాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ హెడ్డాఫీసులో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2700 కిలోల గంజాయితోపాటు, డ్రగ్స్‌ను డిస్పోజల్ చేయాలని, 650 వాహనాలను వేలం వేయాలని సూచించారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలని, క్రైమ్ కంట్రోల్‌కు ఎన్ ఫోర్స్‌మెంట్ టీమ్‌లు మరింత చురుకుగా పని చేయాలన్నారు. అసిస్టెంట్‌కమిషనర్ ఆర్.కిషన్, శంషాబాద్, మేడ్చల్, మాల్కాజిగిరి, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్లు కృష్ణప్రియ, ఫయాజుద్దీన్, కె.నవీన్‌కుమార్, ఉజ్వలా రెడ్డి, విజయభాస్కర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సీఐలు హాజరయ్యారు.