రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం అన్నారంలో ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. జనవరి 21 రాత్రి 12 గంటల సమయంలో బాయిలర్ పేలింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి.
4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అర్థరాత్రి చెలరేగిన మంటలు.. ఉదయం వరకు అదుపులోకి రాలేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండడంతో కార్మికులు, నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు. షిఫ్ట్ లో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.