BRSAL vs RAR: ఛేజింగ్‌లో సంచలనం.. చివరి ఓవర్‌లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్

టీ20 క్రికెట్ లో సంచలనం నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రంగపూర్ రైడర్స్ సంచలన ఛేజింగ్ తో అద్భుత విజయం సాధించింది. ఫార్చ్యూన్ బరిషల్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో రంగపూర్ రైడర్స్ విజయానికి 26 పరుగులు కావాలి. ఈ దశలో రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కైల్ మేయర్స్ వేసిన ఈ ఓవర్ లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. తొలి బంతికి సిక్సర్ కొట్టిన అతను.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు. చివరి మూడు బంతుల్లో సమీకరణం 3 బంతుల్లో 12 పరుగులకు వచ్చింది. 

ALSO READ | NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్

తొలి రెండు బంతులకు సిక్సర్, ఫోర్ కొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్ కొట్టి బాది ఊహించని విజయాన్ని అందించాడు. 198 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కుషుధిల్ షా (48), ఇఫ్తికార్ అహ్మద్ (48) భాగస్వామ్యంతో రంగాపూర్ మ్యాచ్ లోకి వచ్చింది. వీరిద్దరూ 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ ఫార్చ్యూన్ బరిషల్ వైపు మళ్లింది. 

ALSO READ | Virat Kohli: రంజీ ట్రోఫీ కాదు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్న కోహ్లీ.. కారణమేంటంటే..?

నురుల్ హసన్ పవర్ హిట్టింగ్ తో 7 బంతుల్లో 3 ఫోర్లు.. 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఫార్చ్యూన్ బరిషల్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. కైల్ మేయర్స్ 29 బంతుల్లో 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఓపెనర్లు తమీమ్(40), శాంటో(41) రాణించారు.