మూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తం: బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమ వెల్లడి

బషీర్ బాగ్, వెలుగు: ఎలాంటి అంచనాలు, ప్రణాళికలు లేకుండా రేవంత్​రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమవిమర్శించారు. శుక్రవారం ఆమె బర్కత్ పురాలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 22 వేల కోట్లతో సబర్మతి ప్రాజెక్టును, 44 వేల కోట్లతో నమో గంగ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. 

మూసీ సుందరీకరణకు లక్షా 50వేల కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారని, అంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సుందరీకరణను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తానని బెదిరిస్తున్నారని, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 17న ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో  బీజేపీ నేతలు బస చేస్తారని, అడ్డుకునేవాళ్లు ఎవరైనా ఉంటే అడ్డుకోవచ్చని సవాల్ విసిరారు.