గెలిచాక 3వేల ఇండ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తా : రాణిరుద్రమ

రాజన్నసిరిసిల్ల,వెలుగు : ఎమ్యెల్యేగా గెలిచాక సిరిసిల్లలో 3 వేల ఇండ్లకు పట్టాలిప్పిచ్చి ఇండ్లను క్రయవిక్రయాలు చేసుకునేందుకు రిజస్ట్రేషన్లు చేయిస్తానని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ హామీ ఇచ్చారు. సోమవారం ఆమె సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్, సుందరయ్యనగర్​ కాలనీల్లో పాదయాత్ర చేశారు.

ఇంటింటికి తిరిగి ఓటేయాలని కోరారు. ఆమె వెంట  లీడర్లు ఆడెపు రవీందర్, నాగరాజు, శ్రీనివాస్, కైలాశ్, నరేశ్ పాల్గొన్నారు.