- జర్నలిస్టులను బ్యాన్ చేసుడేంది?
- బీజేపీ నేత రాణి రుద్రమ ఫైర్
హైదరాబాద్, వెలుగు : పద్నాలుగు మంది జర్నలస్టులను బహిష్కరించడం ఇండియా కూటమి నియంతృత్వ పోకడను తెలియజేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. ఆ కూటమి అప్రజాస్వామ్య ఎజెండాకు ఇది నిదర్శనమన్నారు. జాతీయ మీడియాను బెదిరించడం వాళ్ల అహంకారానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఫైర్ అయ్యారు.
ALSO READ: మహిళలు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి : బీఆర్ఎస్ డిమాండ్
‘‘మీడియా అనేది పీపుల్స్ ప్లాట్ ఫాం, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలే జర్నలిస్టులు. అలాంటి వారిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ కూటమికి వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలే బుద్ధి చెప్తరు”అని పేర్కొన్నారు. తెలంగాణలో కొన్ని పత్రికలను, టీవీ చానళ్లను బ్యాన్ చేస్తూ, జర్నలిస్టులను అవహేళన చేస్తున్న సీఎం కేసీఆర్ ఎజెండా, కాంగ్రెస్ ఎంజెండా ఒక్కటేనన్నారు.