కేటీఆర్​కు ఎందుకు ఓటేయాలి..? : రాణీరుద్రమ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌‌కు ఎందుకు ఓటేయాలి.. నియోజకవర్గ ప్రజలను పదేండ్లగా దగా చేసినందుకా అని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణీరుద్రమ ప్రశ్నించారు. . మంగళవారం ‘కేటీఆర్ ను ప్రశ్నిద్దాం.. పారదోలుదాం’ అనే నినాదంతో 17 అంశాలతో కూడిన చార్జ్ షీట్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా రాణీరుద్రమ మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు నేరేళ్ల దళితులను పోలీసులతో కొట్టించినందుకా.. కేటీఆర్ బంధువులు హాస్టల్ విద్యార్థులను లైంగికంగా వేధించినందుకు ఓటేయాలా అని ప్రశ్నించారు. వర్కర్లను ఓనర్లుగా చేస్తానని.. ఓనర్లు వర్కర్లుగా చేసిన ఘనత కేటీఆర్‌‌ దేనన్నారు. సెస్​లో రూ. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తినే తిరిగి సెస్ చైర్మన్ చేశారని విమర్శించారు.