
జోగిపేట,వెలుగు: సమాజంలో మహిళలు ఇబ్బందిపడకూడదని 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించిన ఘనత బీజేపీదని ఆ పార్టీ అధికార ప్రతినిది రాణీరుద్రమదేవి అన్నారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం జోగిపేటలోని హన్ మాన్ చౌరస్తాలో మాట్లాడారు. కట్టెల పొయ్యిమీద వంటచేస్తున్న మహిళల అవస్థలను గమనించిన పీఎం మోదీ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారన్నారు. వీధిలైట్లు, శ్మశానవాటికలు, రేషన్‌బియ్యం వంటి ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతీ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్కల్పించిన ఘనత పీఎం మోదీకే దక్కుతుందని, కరోనా సమయంలో దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆదుకున్న వ్యక్తిగా విదేశాలు గుర్తించాయని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సీనియర్‌నాయకులు అలే భాస్కర్, అనంతరావు కులకర్ణి, ప్రభాకర్‌గౌడ్, సుమన్, ప్రభాత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.