- తిలక్ వర్మ వంద.. హైదరాబాద్ 474/5 డిక్లేర్డ్
సోవిమా (నాగాలాండ్) : రంజీ ట్రోఫీలో ప్లేట్ గ్రూప్‌కు పడిపోయిన హైదరాబాద్ కొత్త సీజన్‌ను అదిరే ఆటతో షురూ చేసింది. నాగాలాండ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్ లో తొలి రోజే దంచికొట్టింది. రాహుల్ సింగ్ (157 బాల్స్‌లో 23 ఫోర్లు, 9 సిక్సర్లతో 214) డబుల్ సెంచరీ, కెప్టెన్ తిలక్ వర్మ (100 నాటౌట్) సెంచరీతో చెలరేగారు. దాంతో 76.4 ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ ను 474/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ (80)తో రాహుల్ రెండో వికెట్‌కు 228 రన్స్
తిలక్‌తో మూడో వికెట్‌కు 118 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో 143 బాల్స్‌లో డబుల్ సెంచరీ దాటిన రాహుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఇండియన్‌గా నిలిచాడు.1985లో బరోడాపై బాంబే తరఫున రవిశాస్త్రి 123 బాల్స్‌లో డబుల్ సెంచరీ కొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన నాగాలాండ్ తొలి రోజు చివరకు మొదటి ఇన్నింగ్స్ లో 35/1 స్కోరు చేసింది.