
నాగ్‌పూర్ / అహ్మదాబాద్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై మళ్లీ బ్యాటింగ్‌లో తడబడింది. 406 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు గురువారం నాలుగో రోజు బరిలోకి దిగిన ముంబై ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 83/3 స్కోరు చేసింది. ఆకాశ్ ఆనంద్ (27 బ్యాటింగ్), శివమ్ దూబే (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆయుష్ మాత్రే (18), సిద్ధేశ్ లాడ్ (2), రహానె (12) ఫెయిలయ్యారు. హర్ష్ దూబే రెండు వికెట్లు తీశాడు.
మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే ఇంకా 323 రన్స్ చేయాల్సి ఉంది. అంతకుముందు 147/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 110.1 ఓవర్లలో 292 రన్స్‌కు ఆలౌ టైంది. దీంతో ముంబై ముందు 406 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. యష్ రాథోడ్ (151), అక్షయ్ వాడ్కర్ (52) ఐదో వికెట్‌కు 158 రన్స్ జోడించారు. శామ్స్ ములానీ 6, తనుష్ కొటియాన్ 3 వికెట్లు పడగొట్టారు. ఇక కేరళ, గుజరాత్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది.
222/1 ఓవర్‌నై ట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 429/7 స్కోరు చేసింది. జైమిత్ పటేల్ (74 బ్యాటింగ్), సిద్ధార్థ్ దేశాయ్ (24 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రియాంక్ పాంచల్ (148) భారీ స్కోరు చేయగా, మనన్ హింగ్రాజి యా (33), హేమంగ్ పటేల్ (27), ఉర్విల్ పటేల్ (25) ఫర్వాలేదనిపించారు. జలజ్ సక్సేనా 4 వికెట్లు తీశాడు.