
నాగ్‌పూర్/అహ్మదాబాద్ : ముంబైతో రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో విదర్భ 260 రన్స్ ఆధిక్యంలో నిలిచి పట్టు బిగించింది. యష్ రాథోడ్ (59 బ్యాటింగ్), అక్షయ్ వాడ్కర్ (31 బ్యాటింగ్) రాణించడంతో.. బుధవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 147/4 స్కోరు చేసింది. అంతకుముందు 188/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 రన్స్‌కు ఆలౌటైంది.
దీంతో విదర్భకు 113 రన్స్ ఆధిక్యం లభించింది. ఆకాశ్ ఆనంద్ (106) సెంచరీ కొట్టాడు. మరోవైపు కేరళతో మ్యాచ్‌లో ప్రియాంక్ పాంచల్ (117 బ్యాటింగ్), ఆర్యా దేశాయ్ (73) రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 222/1 స్కోరు చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 రన్స్‌కు ఆలౌటైంది.