షిల్లాంగ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మేఘాలయతో రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 81 రన్స్ తేడాతో గెలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు182/4తో శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 80 ఓవర్లలో 346/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు (124 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. చందన్ సహానీ (52), సీవీ మిలింద్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ప్రజ్ఞయ్ రెడ్డి (34), తనయ్ త్యాగరాజన్ (35) రాణించారు. స్వరజిత్ దాస్, రామ్ గురాంగ్ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో 154 రన్స్‌కే కుప్పకూలింది. జస్కీరత్ సింగ్ (53), కిషన్ లింగ్డో (47) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తనయ్ 3, మిలింద్, రవితేజ చెరో రెండు వికెట్లు సాధించారు. రోహిత్ రాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.