రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ సెంచరీ

రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ సెంచరీ

నాగ్‌‌‌‌పూర్‌ ‌‌‌: తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (136) సెంచరీతో చెలరేగడంతో విదర్భతో రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 90/2 తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 91.4 ఓవర్లలో 326 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో 136 రన్స్ ఆధిక్యం లభించింది. సీవీ మిలింద్‌‌‌‌ (38), హిమతేజ (31), ఫర్వాలేదనిపించారు. 

తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన విదర్భ ఆట ముగిసే టైమ్‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 19.5 ఓవర్లలో 56/2 స్కోరు చేసింది. అథర్వ తైడ్‌‌‌‌ (20 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. ధ్రువ్‌‌‌‌ షోరే (23) ఓ మాదిరిగా ఆడాడు. కాగా, ఈ మ్యాచ్‌‌‌‌కు హాజరైన హెచ్‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్‌‌‌‌ సెంచరీ హీరో తన్మయ్‌‌‌‌ను అభినందించి వ్యక్తిగతంగా అతనికి రూ.1 లక్ష రివార్డు ప్రకటించారు.