జైపూర్: రాజస్తాన్‌తో బుధవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్–బి నాలుగో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (66), రాహుల్ రాదేశ్ (43 బ్యాటింగ్) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 261/5 స్కోరు చేసింది. రాదేశ్‌తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను ఆరంభంలో రాజస్తాన్ బౌలర్లు దెబ్బకొట్టారు.
టాపార్డర్‌లో తన్మయ్ అగర్వాల్ (40) మెరిసినా, అభిరత్ రెడ్డి (21), రోహిత్ రాయుడు (21), హిమతేజ (24) నిరాశపర్చారు. చివర్లో రాహుల్ సింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. హిమతేజతో నాలుగో వికెట్‌కు 42, రాదేశ్‌తో ఐదో వికెట్‌కు 69 రన్స్ జత చేసి ఔటయ్యాడు. అజయ్ నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించాడు. అజయ్ సింగ్ 3, దీపక్ చహర్, అరాఫత్ ఖాన్ చెరో వికెట్ తీశారు.