ముంబై : టీమిండియా టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షా తీరు మరోసారి చర్చనీయాంశమైంది. నేషనల్ టీమ్‌కు దూరమైన పృథ్వీని త్రిపురతో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచి ముంబై తప్పించింది. ఫిట్‌నెస్, క్రమశిక్షణ సమస్యల కారణంగా అతనిపై వేటు వేసింది. 24 ఏండ్ల షా టీమ్ ట్రెయినింగ్ సెషన్స్‌కు తరచూ డుమ్మా కొడుతున్నాడు. అదే సమయంలో తను కొంచెం బరువు కూడా పెరిగి ఫిట్‌నెస్ కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ ఫామ్ కూడా కోల్పోయాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 7, 12, 1, 39* స్కోర్లతో నిరాశపరిచాడు. అయితే, ఫిట్‌నెస్, వ్యవహార శైలి సరిగ్గా లేదన్న కారణంతో ముంబై సీనియర్ మెన్స్ సెలెక్షన్ కమిటీ అతడిని తప్పించాలని నిర్ణయించింది. అతని ప్లేస్‌లో ఓపెనర్ అఖిల్ హెర్వాద్కర్‌ను జట్టులోకి తీసుకుంది.