న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో సరికొత్తగా క్రికెట్ మొదలుపెట్టాలనుకునే యంగ్‌స్టర్స్ కోసం రంజీ ట్రోఫీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి దేశంలోని పలు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రాణించడం ద్వారా టీమిండియా తలుపులు తట్టాలని చాలా మంది కుర్రాళ్లతో పాటు వెటరన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. కెరీర్ చివరి దశలో ఉన్న అజింక్యా రహానె, చతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, జైదేవ్ ఉనాద్కట్‌లాంటి ప్లేయర్లు మరోసారి టీమిండియాలో చోటు సంపాదించాలని భావిస్తున్నారు.
రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, ఇషాన్ పోరెల్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని రంజీల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఎలైట్‌లో మొత్తం నాలుగు గ్రూప్‌లు ఉండగా, ప్లేట్ డివిజన్‌లో హైదరాబాద్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. శుక్రవారం మొదలయ్యే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్.. నాగాలాండ్‌తో పోటీ పడనుంది.