- ప్రిజం పబ్ కాల్పుల ఘటనలో కొనసాగతున్న దర్యాప్తు
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని ప్రిజం పబ్వద్ద కాల్పులకు తెగబడ్డ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్బత్తుల ప్రభాకర్ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ఉద్యోగి రంజిత్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు రంజిత్ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తున్నది. ఈ నెల1న ప్రిజం పబ్ వద్ద తనను పట్టుకునేందుకు వెళ్లిన మాదాపూర్ సీసీఎస్ పోలీసులపై ప్రభాకర్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి గాయాలు అయ్యాయి.
కాల్పులు జరిగిన రోజున ప్రభాకర్‌ను స్కోడా కారులో రంజిత్ డ్రాప్చేసినట్లు పోలీసులు గుర్తించి, గురువారం గచ్చిబౌలి టీఎన్జీవోఎస్ కాలనీలోని అతని ఫ్లాట్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి స్కోడా ర్యాపిడ్ కారు, కేటీఎం బైక్, ఒక స్మార్ట్‌ఫోన్, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
బస్సులో మొదలైన పరిచయం..
ఏపీలోని వెస్ట్‌గోదావరి జిల్లా గోపవరం గ్రామానికి చెందిన మెన్ని రంజిత్(28) 2023లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వస్తుండగా, బస్సులో బత్తుల ప్రభాకర్పరిచయమయ్యాడు. రంజీత్ కేపీహెచ్బీలో ఉంటూ సాఫ్ట్వేర్ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులకు బత్తుల ప్రభాకర్వట్టినాగులపల్లిలో రంజిత్ పేరుతో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకున్నాడు. అందులో తనతోపాటు ఉండొచ్చని రంజిత్‌కు ఆఫర్ ఇచ్చాడు. దాంతో రంజిత్ 2024లో ప్రభాకర్ ఫ్లాట్‌కు షిఫ్ట్ అయ్యాడు.
ప్రభాకర్ఆర్థిక లావాదేవీల కోసం రంజిత్తన బ్యాంక్ అకౌంట్లను అందజేశాడు. ఇద్దరు కలిసి గన్స్ కొనుగోలు చేసేందుకు బీహార్‌కు వెళ్లారు. వీరికి రవి అనే మరో వ్యక్తి సహకరించగా, అందరూ కలిసి బీహార్వెళ్లారు. అక్కడ నిందితులకు ఆశ్రయం కల్పించిన అన్సు కోసం పోలీసులు వెతుకుతున్నారు.