- లోక్‌సభ ఎన్నికలను కార్యకర్తలు చాలెంజ్‌గా తీసుకోవాలి
- చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
శంషాబాద్/గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి బూత్ కోఆర్డినేటర్ లోక్‌సభ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకోవాలని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి సూచించారు. చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
చేవెళ్ల ఇన్చార్జ్ వేంనరేందర్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ నేత ఫహీంతో కలిసి రంజిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు అమలు చేశామని, త్వరలో మిగిలిన రెండు అమలు చేస్తామన్నారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఒక్కో కోఆర్డినేటర్‌కు ఒక బూత్ ఇచ్చామని, చురుకుగా పనిచేసే వాళ్లకు బూత్‌లు అప్పగించాలని సూచించారు.
బూత్ కమిటీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే అత్తాపూర్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన యూత్ కాంగ్రెస్ యువ సమ్మేళనంలో రంజిత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ కోటి ఉద్యోగాలు అంటూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదని, తమకు కూడా దేవుడేనని చెప్పారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిౖ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్‌విసిరారు. సినీ నిర్మాత బండ్ల గణేష్, స్టేట్యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.