తాండూరు, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు, చేవెళ్ల ఇన్ చార్జ్ వేం నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రతి కాంగ్రెస్కార్యకర్త భారీ మెజార్టీతో ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
శనివారం తాండూరు టౌన్ సమీపంలోని జీపీఆర్ గార్డెన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం జరిగింది. 30 రోజులు నా కోసం కష్టపడితే.. ఐదేండ్లపాటు మీకోసం కష్టపడతానని ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, తాండూరు ఇన్ చార్జ్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.