ఎవరీ రణవీర్ అల్లాబాడియా..? ఇతడి నాలుక కొస్తే లక్షలు, కోట్లు ఎందుకిస్తామంటున్నారు?

ఎవరీ రణవీర్ అల్లాబాడియా..? ఇతడి నాలుక కొస్తే లక్షలు, కోట్లు ఎందుకిస్తామంటున్నారు?

రణవీర్ అల్లాబాడియా.. 4.5 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు, 1.05 కోట్ల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్, పోడ్ కాస్టర్.. ఇతగాడు ఓ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇతడిపై దేశ నలుమూలలా కేసులు నమోదవుతున్నాయి. ఇతడి నాలుక కొస్తే లక్షలు, కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని బహిరంగ ప్రకటనలు వస్తున్నాయి. ఇతడు చేసిన తప్పేంటి..? ఎందుకీ ఆగ్రహం అనేది చూద్దాం.. 

"నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం చూస్తావా లేదా ఒక్కసారి చేరి శాశ్వతంగా ఆపేస్తావా?" అని ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్‌లో ఓ మహిళా కంటెస్టెంట్‌ని రణ్‌వీర్ అల్లబాడియా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఆమె సిగ్గుతో తలదించుకుంది. తన తల్లిదండ్రుల శృంగార జీవితంపై ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో అతనితో పాటు స్టేజ్ పంచుకున్న ఇతర హోస్టులు అతన్ని ప్రశ్నని ఖండించకపోగా.. వెకిలి నవ్వులు నవ్వడం గమనార్హం.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అతడిపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడ పౌరులు స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుండడంతో పోలీసులు అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అతడిపై పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దాంతో, పోలీసులు అతడికి విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపుతున్నారు. బహుళ ఎఫ్ఐఆర్‌ల నేపథ్యంలో రణ్‌వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బహుళ ఎఫ్ఐఆర్‌లని విలీనం చేయాలని ధర్మాసనాన్ని  కోరారు. 

మాజీ చీఫ్ జస్టిస్ కొడుకు..

సుప్రీంకోర్టులో అల్లాబాడియా తరఫున భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కుమారుడు, సీనియర్ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అల్లాబాడియాపై బహుళ ఎఫ్ఐఆర్‌లు నమోదైన నేపథ్యంలో ఈ కేసును అత్యవసర విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఆయన కోరారు. అస్సాం పోలీసులు శుక్రవారం అతన్ని విచారణకు పిలిచిన విషయాన్నిధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే,  అభినవ్ చంద్రచూడ్ అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అత్యవసర జాబితా కోసం కేసుల గురించి మౌఖికంగా ప్రస్తావించడానికి అనుమతి లేదని ధర్మాసనం పేర్కొంది.

నా నుంచి అతన్ని ఎవరూ కాపాడలేరు.. 

రణవీర్ అల్లాబాడియా వ్యాఖ్యలపై మహాభారత నటుడు సౌరవ్ గుర్జార్.. యూట్యూబర్‌ను బహిరంగంగా బెదిరించారు. ఇతడు చేసిన వ్యాఖ్యలు క్షమించరానివాని అన్నారు. ఇటువంటి వారిని మొదట్లోనే కట్టడి చేయాలని లేనియెడల మరింత మంది నీచులు పుట్టుకొస్తారని గట్టిగానే హెచ్చరించారు.  

"రణవీర్ అల్లాబాడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. అతన్ని తిట్టేందుకు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాలనుకోవడం లేదు. నాకు ఏనాడైనా ఎదురు పడితే, నా నుండి అతన్ని రక్షించలేరు.." అని సౌరవ్ గుర్జార్ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

నాలుక కొస్తే.. లక్ష రూపాయల రివార్డు

రణ్‌వీర్ వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకమని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రతినిధి శిశిర్ చతుర్వేది అన్నారు. అతని నాలుక కోసిన వారు ఎవరికైనా లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు.

ఐదు లక్షల రివార్డు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ సైతం రివార్డు ప్రకటన చేశారు. రణ్‌వీర్ అలహాబాద్‌డియా నాలుక కోసినవారికి అన్సారీ రూ.5 లక్షల బహుమతిని ప్రకటించారు.