కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?

కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే నటి దీపికా రణవేర్ సింగ్ దంపతులకి సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో అభిమనలు దీపికా  కూతురిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈరోజు (నవంబర్ 1) దీపికా రణవీర్ సింగ్ దంపతులు తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు. ఇందులో భాగంగా చిన్నారికి "దూవా పదుకునే  సింగ్" అని నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అలాగే దూవా అంటే ప్రార్థన అని అర్థం వస్తుంది. ఆమె మా ప్రార్థనలకి సమాధానమని అలాగే మా హృదయాలు ఆమెపై ప్రేమ & కృతజ్ఞతతో నిండి ఉన్నాయని చెప్పుకొచ్చింది దీపికా పదుకునే. అలాగే చిన్నారి పాదాల ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా దీపికా పదుకునే ప్రముఖ స్టార్ హీరో రణవీర్ సింగ్  2018 సంవత్సరంలోని నవంబర్ 18న వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన 6 ఏళ్ల తర్వాత దువా పదుకునే సింగ్ జన్మించింది. ఇక వీరివురి కెరీర్ విషయానికొస్తే దీపికా పదుకునే రణవీర్ సింగ్ కలసి సింగం ఎగైన్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.