బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనేల మధ్య విభేదాలు వచ్చాయని, త్వరలో ఇద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కు ఈ జోడీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పులిస్టాప్ పెట్టింది. రణ్ వీర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలును షేర్ చేశాడు. టోటల్ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన రణ్ వీర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలపై దీపిక 'ఎడిబుల్' అంటూ కామెంట్ చేసింది. దీపిక కామెంట్ కు కిస్ ఎమోజీతో రణ్ వీర్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ అని అర్ధమవుతుంది.
ఆరేళ్ల డేటింగ్ తర్వాత నవంబర్ 14, 2018న రణ్ వీర్, దీపిక పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో ‘రాకీ అవుర్ రాణికి ప్రేమ్ కహాని’ షూటింగ్ కంప్లీట్ అవ్వగా, ‘సర్కస్’ షూటింగ్ దశలో ఉంది. అటు దీపికా నటించిన పఠాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్‌తో ప్రాజెక్ట్-కే చిత్రంలో ఆమె నటించబోతుంది. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.