బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ముంబైలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ను కలిశాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న క్రమంలో ధోని ముంబై వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రణ్ వీర్ సింగ్..మహేంద్రసింగ్ ను కలిసి ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్, ధోని ముచ్చటించుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ధోనితో ముచ్చటించిన ఫోటోలను షేర్ చేసిన రణ్ వీర్ సింగ్..అందులో ఓ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో మహేంద్రసింగ్ ను రణ్ వీర్ సింగ్ ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉంది. ధోని నవ్వుతుండగా..రణ్ వీర్ సింగ్..ధోని చెంప కొరికాడు. ఈ ఫోటోను షేర్ చేసిన రణ్ వీర్ సింగ్..మేరా మహి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
రణ్ వీర్ సింగ్, ధోని కలిసిన ఫోటోలను చూసి వారి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేశారు. కామెంట్స్ తో పొగడ్తల వర్షం కురిపించారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారంటూ కామెంట్ చేశారు.
- ALSO READ | Cricket World Cup 2023: సచిన్‌కి అరుదైన గౌరవం.. క్రికెట్ గాడ్ చేతుల మీదగా వరల్డ్ కప్ ట్రోఫీ
మరోవైపు ఈ ఫోటో ధోని కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు. పాత ధోనిని గుర్తు చేశాడు. కెరీర్ ఆరంభంలో పొడవాటి జుట్టుతో ఉన్నప్పుడు ధోని ఎలా ఉన్నాడో..ప్రస్తుతం ధోని కూడా అలాగే ఉన్నాడు. అటు రణ్ వీర్ సైతం పొడవాటి జుట్టుతోనే కనిపించాడు. అతను సింబా లుక్ కోసం మీసాలు పెంచాడు.