తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. 

తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటుగా వెళ్తున్న ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన పలువురు భక్తులను 108లో తిరుమలలోని అశ్విని హాస్పిటల్ కి తరలించారు సిబ్బంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.