పదేళ్ల బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు..

పదేళ్ల బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు..

నిరుద్యోగుల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... స్వరాష్ట్రం ఏర్పడితే నియామకాలు దక్కుతాయని నిరుద్యోగులు భావించారని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కానీ గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా పని చేయలేదని , కానీ తమ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేరుస్తుందన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో  రావూస్ అకాడమీను....  అకాడమీ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు తో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం....  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీజీపీఎస్సీ ను ప్రక్షాళన చేశామని... ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ , దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే  50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని... ఇంకా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్య అన్నారు. సివిల్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు సహాయం అందిస్తామన్నారు.  పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఇలాంటి అకాడమీ లు ఎంతో దోహదపడుతాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.