హైదరాబాద్, వెలుగు: రాప్ ఎకో మోటార్స్ తొలి ఎల్5 సెగ్మెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ 'ఈ రాజా'ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో ఆవిష్కరించారు. 'మేక్ ఇన్ ఇండియా' మిషన్లో భాగంగా తయారైన ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ప్రయాణికులు, సరుకు రవాణా వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 100 శాతం భారతీయ డిజైన్, భాగాలతో ‘ఈ రాజా’ తయారు చేశామని రాప్ ఎకో మోటార్స్ సీఈవో ఆర్ బాలకృష్ణన్ అన్నారు.