- 15.80 సెకండ్లలో రాష్ట్రాలు, రాజధానుల పేర్లు చెప్పిన మనుశ్రీరామ్
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన మాక్స్ కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్– శ్వేత దంపతుల కుమారుడు రాపర్తి మనుశ్రీరామ్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. పట్టణంలోని సంస్కృతి స్కూల్లో మనుశ్రీరామ్ 4వ తరగతి చదువుతున్నాడు. అంతకుముందు ఈ రికార్డు 19 సెకండ్లుగా నమోదై ఉండగా, ప్రస్తుతం మనుశ్రీరామ్ 15.8 సెకండ్లలో రాష్ర్టాలు, రాజధానుల పేర్లు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో గెలుపొందిన శ్రీరామ్ కు సోమవారం సంస్థ నిర్వాహకులు కొరియర్ ద్వారా అవార్డును పంపించారు.