యూట్యూబర్ హర్షసాయి కేసులో కీలక అప్ డేట్ ఇది. బాధితురాలి లాయర్ నాగూర్ బాబు వీ6 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. హర్షసాయి ఏం చేశాడు.. ఎలా చేశాడు.. ఎలా మోసం చేశాడు.. ఎలా ట్రాప్ చేశాడు అనేది వివరంగా చెప్పుకొచ్చారు. బాధితురాలిపై హర్షసాయి లైంగిక దాడి ఎలా చేశాడు అనేది లాయర్ నాగూర్ బాబు మాటల్లో ఇలా..
>>> హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న మెగా అనే సినిమాకి బాధితురాలు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
>>> 2022లో ఒక సాంగ్ కోసం.. బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది.
>>> తన దగ్గర ఒక స్టోరీ ఉందని.. సినిమా తీస్తే మంచి సక్సెస్ అవుతుంది అంటూ హర్షసాయి.. బాధితురాలిని నమ్మించాడు.
>>> హర్షసాయి మాటలు నమ్మి.. బాధితురాలు మెగా అనే మూవీ స్టార్ట్ చేసింది. సొంత డబ్బు ఖర్చు చేసింది.
>>> ఇదే సమయంలో హైదరాబాదులో ఉండడానికి షెల్టర్ లేదని హర్షసాయి చెప్పడంతో.. బాధితురాలు హర్ష సాయి కోసం ఒక విల్లాను ఏర్పాటు చేసి ఇచ్చింది.
>>> స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అంటూ బాధితురాలిని.. హర్ష సాయి పిలిచేవాడు.
>>> హర్షసాయి మాటలు నమ్మిన బాధితురాలు... అతను ఉండే విల్లాకు వెళ్ళింది.. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి.. ఆమె స్పృహలో లేనప్పుడు బాధితురాలిపై హర్షసాయి లైంగిక దాడి చేశాడు.
>>> లైంగిక దాడిని వీడియో రికార్డ్ చేసి.. మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు హర్షసాయి. ఇలాంటివి చేయడం నాకు ఫాంటసీ.. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయని హర్షసాయి చెప్పేవాడు.
>>> విషయం తెలిసిన హర్ష సాయి తండ్రి.. మీడియాకు వెళ్తే ఇద్దరి ఫేం నాశనం అవుతాయని సర్ది చెప్పాడు.
>>> హర్షసాయి నాన్న.. బాధితురాలికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు, దీంతో బాధితురాలు నమ్మింది, దీంతో కేస్ ఫైల్ చేయకుండా ఉంది.
>>> 2023లో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది. ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాశ పుట్టింది. బాధితురాలి పేరుతో ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.
>>> టీజర్ రిలీజ్ ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటి నుంచి బాధితురాలు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తుంది. ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకు అనుకూలంగా మార్చుకుని.. అవి చూపించి ఆమెను బెదిరించాడు. బాధితురాలిని మానసికంగా.. శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ.. సినిమా కాపీ రైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని.. లేకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని బెదిరించాడు.
>>> హర్ష సాయి వేధింపులు తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం.. బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో ఎవిడెన్స్ లు కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టులో హర్షసాయికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం మాకుంది. ఇష్యూ తర్వాత హర్ష సాయి బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. బాధితురాలికి న్యాయం జరగాలి.. హర్ష సాయికి శిక్ష పడాలి అనేది మా ఉద్దేశం అన్నారు బాధితురాలి తరపున లాయర్ నాగూర్ బాబు..