హర్షసాయిపై రేప్ కేసు నమోదు.. ఆ అమ్మాయికి నోటీసులు.. డబ్బుల కోసమే అంటున్న యూట్యూబర్

హర్షసాయిపై రేప్ కేసు నమోదు.. ఆ అమ్మాయికి నోటీసులు.. డబ్బుల కోసమే అంటున్న యూట్యూబర్

యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నాడని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కంప్లయింట్ చేసిన విషయం తెలిసిందే. 

ఈ కంప్లయింట్ ఆధారంగా యూట్యూబర్ హర్షసాయిపై 328, 376 (2) 354 , 376N సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. కంప్లయింట్ కు సంబంధించి.. ఆధారాలు సమర్పించాలంటూ యువతికి కూడా నోటీసులు పంపించారు. 

తనపై నమోదు అయిన కేసులపై స్పందించాడు హర్షసాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. డబ్బుల కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నిజాలు త్వరలో బయటకు వస్తాయి.. నా అడ్వకేట్ త్వరలో మీ ముందుకు వస్తారు అంటూ సోషల్ మీడియా ద్వారా తన వెర్షన్ వినిపించాడు.

హర్షసాయితో గతంలో ఆ యువతి కలిసి షో చేసిన వీడియోలు, హర్షసాయి, ఆ యువతి మాట్లాడుకున్న ఆడియోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హర్షసాయి గురించి ఆ యువతి చేసిన మంచి మంచి కామెంట్లను హర్షసాయి అనుచరులు పోస్టులు చేస్తున్నారు.