ఎల్బీనగర్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి రంగారెడ్డి జిల్లా స్పెషల్ఫాస్ట్ట్రాక్కోర్టు పదేండ్లు జైలు శిక్ష విధించింది. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం కలికల్ గ్రామానికి చెందిన మండే అనిల్(22) కుటుంబ సభ్యులతో కలిసి వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్నాడు. 2
019లో స్థానికంగా ఉండే బాలికను పరిచయం చేసుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
అనిల్‌ను అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించారు. పూర్తి ఆధారాలతో ఎల్బీనగర్పోక్సో కోర్టు((స్పెషల్ఫాస్ట్ ట్రాక్ కోర్టు)లో చార్జ్షీట్దాఖలు చేశారు. అనిల్‌కు పదేండ్లు జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందజేసింది.