
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. ఐదేండ్ల చిన్నారిపై ఆమె ఇంటి పక్కనే నివసించే 17 ఏండ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారి తలను గోడకేసి బాది.. ఆమె ప్రైవేట్ భాగాలపై బ్లేడ్ లాంటి వస్తువుతో గాట్లు పెట్టాడు.
ఈ నెల 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. శివపురికి చెందిన బాలిక 23న తప్పిపోయింది. కుటుంబ సభ్యులు వెతకగా.. పక్కింటి టెర్రస్‌పై రక్తంతో తడిసి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు ఆపరేషన్ చేసి బాలిక ప్రైవేట్ భాగాలలో 28 కుట్లు వేశారు. తీవ్రమైన అంతర్గత గాయాల కారణంగా కొలొస్టమీ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి స్పృహలో ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు.