
కామారెడ్డి టౌన్, వెలుగు : దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాకతీయనగర్, గాయత్రినగర్, దేవునిపల్లి, సరంపల్లిలో ఫోర్స్ ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు అండగా ఉంటామని భరోసా కల్పించేందుకు ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు తదితరుల పాల్గొన్నారు.