![సినిమా స్టంట్ కాదు.. రియల్ యాక్సిడెంట్ : ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓవర్ స్పీడ్](https://static.v6velugu.com/uploads/2025/02/rapida-driver-sent-flying-into-air-after-speeding-bike-hits-car-in-lucknows-indira-nagar_gY4Qic96ZW.jpg)
ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత కళ్లు రోడ్డుపై ఉండటం లేదు.. ముందూ వెనక చూపు లేదు.. అసలు రోడ్డుపై వెళుతున్నాం అన్న సోయి కూడా ఉండటం లేదు. ఇక కుర్రోళ్లు అయితే ఓవర్ స్పీడ్ మామూలుగా ఉండటం లేదు. యూపీలో జరిగిన ఓ యాక్సిడెంట్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో సిటీలోని ఇందిరానగర్ ఏరియా. అభిజిత్ శ్రీవాస్తవ్ అనే కుర్రోడు ర్యాపిడో బైక్ డ్రైవర్ గా ఉన్నాడు. కాల్ వస్తే పికప్ కోసం వెళుతున్నాడు. ఇందిరానగర్ ఏరియాలో స్పీడ్ గా వెళుతూ.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. కారును ఢీకొట్టిన ఎగిరి కారు వెనకాల పడ్డాడు. ఈ యాక్సిడెంట్ లో కారు తప్పులేదని పోలీసులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూసిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చారు.
लखनऊ के इंदिरा नगर इलाके में भीषण एक्सीडेंट हो गया है। इस एक्सीडेंट में बाइक सवार युवक को चोटें आ गई है। इस हादसे का सीसीटीवी फुटेज भी सामने आ गया है। @NavbharatTimes pic.twitter.com/D2rfHMufgz
— NBT Uttar Pradesh (@UPNBT) February 13, 2025
కాలనీలోని ఓ గల్లీ నుంచి టర్న్ తీసుకుని రోడ్డెక్కిన కారును.. ఎదురుగా స్పీడ్ గా వచ్చిన బైక్ ఢీకొట్టింది. వేగంగా కారును ఢీకొనటంతో.. బైక్ పై ఉన్న శ్రీవాస్తవ్.. గాల్లో ఎగిరి కారు వెనకాల పడ్డాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు.
Also Read :- భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త
ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావటంతో పోలీసులు విచారణ చేశారు. కారు తప్పు లేదని.. తప్పంతా ర్యాపిడో డ్రైవర్ దే అని.. దీనిపై ఎవరూ కంప్లయింట్ చేయలేదని స్పష్టం చేశారు పోలీసులు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అదే బైక్ అతనిది తప్పు కాకుండా కారు నడిపే వ్యక్తిది తప్పు అయితే ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కారు అతనిది తప్పు లేదంటున్నారు.. బైక్ నడిపిన వ్యక్తి నుంచి నష్టపరిహారం ఇప్పిస్తారా అని నిలదీస్తున్నారు. ఈ మధ్య ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైందని.. కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. సీసీ కెమెరాలు ఉన్నాయికాబట్టి సరిపోయింది.. లేదంటే కారుదే తప్పు అంటూ గొడవ చేసేవాళ్లు కదా అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.