HYD: జీడిమెట్లలో ర్యాపిడో డ్రైవర్ది హత్యా? ఆత్మహత్యనా?

మేడ్చల్ జిల్లా   జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో ర్యాపిడో డ్రైవర్ అనుమానస్పదంగా మృతి చెందాడు.  కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి(26) హైదరాబాద్ లో  ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ అయోధ్య నగర్ లో మరో వ్యక్తితో కలిసి అద్దెకు ఉంటున్నాడు.  జనవరి 9న ఉదయం ఎంత సేపటికి డోర్ తెరవక పోవడంతో,అనుమానం వచ్చిన ఇంటి యజమాని, చుట్టూ పక్కల వారు తలుపులు తొలగించి చూడగా చేతులు కాళ్ళు,నోరు కట్టేసి,ఫ్యాన్ కు ఉరి తాడుతో వేలాడుతూ ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

ALSO READ | ఎస్సై ఓవర్ యాక్షన్..మహిళ ఆత్మహత్య

సంఘటనా స్థలానికి  వచ్చిన  పోలీసులు, క్లూస్ టీమ్  పరిశీలించారు.  యువకుడిని   అర్థరాత్రి సమయంలో హత్య చేసి,ఆత్మహత్య గా చిత్రీకరించడం కోసం ప్రయత్నం చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులుగదిలో ఉండే మరో వ్యక్తి ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.  హత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.