లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ ప్రైవేట్ రవాణా సంస్థ రాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడో సంస్థ ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోజున, ఓటర్లు రాపిడో యాప్ లో “VOTE NOW” అనే కోడ్ ను ఉపయోగించి ఉచిత రైడ్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఇందుకోసం 10 లక్షల మంది కెప్టెన్లను అందజేస్తామని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో రవాణా సదుపాయం లేకుండా తమ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.