- రేపిస్టులను పబ్లిక్‌గా ఉరితీయాలె
- మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్
భోపాల్: రేపిస్టులను బహిరంగంగా ఉరితీసి చంపాలని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి చనిపోతే.. అంత్యక్రియలకు పర్మిషన్ ఇవ్వకూడదన్నారు. అందరూ చూస్తుండగా ఆ మృతదేహాన్ని గ్రద్దలు, కాకులు పీక్కుతినేలా చేయాలన్నారు. అది చూసిన వారెవ్వరూ ఇంకెప్పుడూ ఏ ఆడబిడ్డనూ తాకేందుకు సాహసించరని తెలిపారు. ఇండోర్ జిల్లా కొడారియా గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన సభలో మంత్రి ఈ కామెంట్లు చేశారు. ఉషా ఠాకూర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో గురించి ఠాకూర్‌ను విలేకరులు సంప్రదించగా.. "ఇలాంటి వీడియోలు ఎక్కువ మందికి చేరాలి. ఇది సమాజానికి మేలు చేస్తుంది" అని చెప్పారు. జైలు శిక్షతో రేపిస్టులకు భయం రావడంలేదన్నారు. వారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్‌తో ప్రజలు ముందుకు రావాలని కోరారు.