
రామ్ హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ కెరీర్‌లో ఇది 22వ చిత్రం. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో 34 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసిన టీమ్.. రెండు పాటలు, ఓ యాక్షన్ సీన్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
హీరోహీరోయిన్స్ రామ్, భాగ్యశ్రీ బోర్సేతో పాటు రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈనెల 28 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదవబోతోందని దర్శకనిర్మాతలు తెలియజేశారు.