గోదావరి తీరంలో.. ర్యాపో 22 లేటెస్ట్ షెడ్యూల్

గోదావరి తీరంలో.. ర్యాపో 22 లేటెస్ట్ షెడ్యూల్

రామ్ పోతినేని హీరోగా  ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌గా నటిస్తోంది. రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 22వ సినిమా. ‘ర్యాపో 22’ వర్కింగ్ టైటిల్‌‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తవగా,  లేటెస్ట్ షెడ్యూల్‌‌ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు.  ఈ షెడ్యూల్‌‌లో రామ్‌‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. 

గోదావరి తీరంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.  ఇందులో సాగర్ పాత్రలో రామ్ క్యూట్ లుక్‌‌లో కనిపించనున్నాడు. మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే టైటిల్ అనౌన్స్‌‌ చేయనున్నారు.