దళితబంధు కోసం రోడ్డెక్కిన దళితులు..భారీగా ట్రాఫిక్ జామ్

వికారాబాద్: అర్హులైన వారికి దళిత బంధు అందడం లేదంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన దళిత మహిళలు, యువకులు రోడ్డెక్కారు. పరిగి - షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైటాయించి తమ నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ రాజకీయ జోక్యం చేస్తూ అర్హులైన వారికి పథకం అందకుండా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ :హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. పరికి చెరువులోకి నురగ

 సర్పంచ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపులో తాము కూడా భాగస్వాములమేనని....మరి తమకెందుకు దళిత బంధు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం తమ అనుచరులకు మాత్రమే పథకం అమలయ్యేలా వ్యవహరిస్తున్నారని...ఇది సరైన పద్దతి కాదని... అర్హులైన వారందరికీ పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.