ఫ్యాన్ ఇంట్లో .... సైకిల్ బయట .. తాగేసిన టీగ్లాస్ సింక్ లో ఉండాలి: సీఎం జగన్

 ఫ్యాన్ ఇంట్లో .... సైకిల్ బయట .. తాగేసిన టీగ్లాస్ సింక్ లో ఉండాలి: సీఎం జగన్


అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్దం సభ జరిగింది.  ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి .... తాగేసిన టీగ్లాస్ ఎప్పుడూ సింక్ లో ఉండాలి.. జగన్ కు ప్రజాబలం లేకపోతే మీకు పొత్తులు ఎందుకు అని  రాప్తాడు సభలో ప్రశ్నించారు.  ..సైకిల్ ను తోయడానికి ప్యాకేజీ స్టార్ ను పెట్టుకున్నాడు..చంద్రబాబు నడిచేందుకు అటో కర్రా... ఇటో కర్రా ఎందుకు లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నగదు బదిలీ..మీరు పొరపాటు చేస్తే చంద్రముఖి  మళ్లీ నిద్ర లేస్తుంది..తాగేసిన టీ గ్లాసు పట్టుకొని మీ రక్తం తాగేందుకు తలుపు కొడుతుందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరికి గుర్తురాదు... కుప్పం నుంచి ఇచ్చాపురం వ రకు చంద్రబాబు మార్కు కనిపించదు.. వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోంది... పక్కరాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?..చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా?.. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా?.. పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?

రాప్తాడు ‘సిద్ధం’ సభ పంచ్‌ డైలాగ్‌లతో దద్దరిల్లింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ .. నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో జన సముద్రం చూడొచ్చు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదు. ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడు. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ  బంగారం ఇస్తాను అంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు’’ అంటూ చంద్రబాబుకు సీఎం జగన్‌ చురకలు అంటించారు.