ఎలక్ట్రానిక్ క్యాపిటల్బెంగళూరు సిటీ ఓ అద్భుత దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. బెంగళూరు నగర ఆకాశ వీధుల్లో ఎన్నడూ చూడని అరుదైన దృశ్యాలు అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. పింక్, గ్రీన్,ఎల్లో రంగులతో అందమైన కాంతిరేఖలు కనుల విందు చేశాయి. ఈ అరుదైన దృశ్యాలను చూసి బెంగళూరువాసులు ఎంజాయ్ చేశారు. అంతేకాదు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రేర్ సీన్స్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
నెటిజన్లు ఈ దృశ్యాలను నార్తర్న్ లైట్స్‌తో పోల్చారు. రాత్రిపూట ఆకాశంలో కనిపించే ప్రకాశవంతమైన స్విర్లింగ్ కర్టెన్లు అని అరోరా బొరియాలిస్ అని పిలుస్తారని అంటున్నారు. మరొకొందరు అరుదైన తోకచుక్క అని రాశారు.
వాస్తవానికి ఇది ఒక సి/2023ఎ3 అనే అరుదైన తోక చుక్క విన్యాసం అని ఖగోళ ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు. ఇది మనకు ఎప్పుడు కనిపించే హేలీ తోక చుక్క వలె కాకుండా దాని రూపాన్ని అరుదైనదని.. బెంగుళూరు ఆకాశంలో కనిపించి కనుల విందు చేసిందని చెబుతున్నారు. దీనిని Tsuchinshan-ATLAS అని కూడా పిలుస్తారు. 80వేల ఏండ్ల తర్వాత సౌర వ్యవస్థలో ప్రవేశించిన తోకచుక్క అని చెబుతున్నారు.
ALSO READ | Under ground village: భూమిలో ఊరు .. రత్నాలకు నిలయం.... ఎక్కడ ఉందో తెలుసా..
సేమ్ టు సేమ ఇలాంటి దృశ్యాలే జనవరి 9, 2023లో చైనాలో కూడా కనిపించాయి. పర్పుల్మౌంటెన్ అబ్జర్వేటరీ అనే ఖగోళ శాస్త్ర ప్రయోగశాల ఈ దృగ్విషయాన్ని కనిపెట్టింది.
జనవరి 9, 2023న చైనాలోని పర్పుల్ మౌంటైన్ అబ్జర్వేటరీ ఈ తోకచుక్కను కనుగొంది. సరిగ్గా ఒక నెల తర్వాత దక్షిణాఫ్రికాలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలెర్ట్ సిస్టమ్ (ATLAS) ద్వారా ఈ తోకచుక్కను మరోసారి చూడగలిగారు.